ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో రాకెట్ విరగ్గొట్టాడు

V6 Velugu Posted on Sep 13, 2021

టెన్నిస్ అభిమానుల్లో నొవాక్ జొకోవిచ్ పేరు తెలియని వారుండరు. గ్రేట్ ప్లేయర్ అయిన జొకోవిచ్.. తన గేమ్‌తోపాటు హావభావాలతోనూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాడు. అందుకే అతడ్ని ఫ్యాన్స్ ముద్దుగా జోకర్ అని పిలుస్తుంటారు. అలాంటి జొకో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో డానీ మెద్వెదేవ్ చేతిలో జొకోవిచ్ ఓడిపోయాడు. టైటిల్ చేజారడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన జొకో.. రాకెట్‌ను పలుమార్లు నేలకేసి విసిరి కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎంత పెద్ద ప్లేయర్ అయినప్పటికీ ఓడాడని రాకెట్ విరగ్గొట్డడం ఏంటని పలువురు ఫ్యాన్స్ జొకోపై కామెంట్లు చేస్తున్నారు. 

 

Tagged tennis, Novak Djokovic, US open, Daniil Medvedev, Racquet

Latest Videos

Subscribe Now

More News