
మంగళవారం
ఆర్ఎక్స్100(RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో..పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
స్టోరీ థీమ్ :
అనుక్షణం భయపడుతూ బతికే ఒక ఊరి ప్రజలు..మంగళవారం వస్తే చాలు ఆ ఊర్లో ఒక శవం లేస్తుందనే భయం. ఇంతకీ ఆ హత్యలు చేస్తుంది ఎవరు?. అది కూడా మంగళవారమే రాగానే..ఎందుకు హత్యలు చేస్తున్నారు.అంతేకాకుండా, హత్య చేసిన ప్రతిసారి..గోడపైన ఏదో రాసి పెట్టి ఉంచడం..ఇలా ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు? అనే ఎన్నో ప్రశ్నలతో మంగళవారం థియేటర్లోకి రాబోతుంది. మదిలో మెదిలే ప్రశ్నలన్నిటికి సమాధానాలు తెలియాలంటే..రేపు రిలీజ్ కాబోతున్న సినిమాని థియేటర్లో చూడాల్సిందే.
also read :- లోకేష్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఖైదీ2, విక్రమ్2 సినిమాలకు డైరెక్టర్ చేంజ్
మ్యూజిక్:
కాంతార, విరూపాక్ష సినిమాలకు అద్భుతమైన పాటలతో..పాటు అదిరిపోయే రీ రికార్డింగ్ అందించిన అజనీష్ లోక్ నాధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. మరోసారి తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ను ఆడియన్స్ కు రుచి చూపించడానికి సిద్దమయ్యాడు. ట్రైలర్ లో కట్ చేసిన విజువల్స్ కు అంజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దీంతో ఈ సినిమాలో ఎటువంటి మ్యూజిక్ ఇస్తున్నాడనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
పాయల్ రాజ్ పుత్:
మంగళవారం సినిమాలో పాయల్ క్యారెక్టర్ నింఫోమానియాక్ అనే కండీషన్‌తో బాధపడుతుందట. అంటే అదుపుచేసుకోలేని శృంగార కోరికలు ఉండే యువతిగా పాయల్ కనిపించనుందని టాక్. ఈ వార్తతో మంగళవారం మూవీ ఊహించిన దానికన్నా మరింత బోల్డ్గా ఉండే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్. మరి ఇలాంటి క్యారెక్టర్ను స్క్రీన్ పై చూపించాలంటే..డైరెక్టర్,పాయల్ ఎంత ధైర్యం చేసి ముందుకు వెళ్లారో అర్ధం అవుతుంది.
స్పార్క్ L.I.F.E :
విక్రాంత్ (Vikranth) హీరోగా..మెహరీన్ (Mehreen), రుక్సార్ (Rukshar) లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ స్పార్క్ L.I.F.E (Spark). ఈ సినిమాతో హీరో విక్రాంత్ పరిచయం అవుతుండడంతో పాటు..డైరెక్షన్ కూడా చేస్తున్నాడు.
స్టోరీ థీమ్ :
ట్రైలర్ లో చూపించిన లవ్, కామెడీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. అలాగే స్టోరీ కాస్తా టర్న్ తీసుకుని..సడెన్ గా క్రైమ్ యాంగిల్ లోకి మారడం థ్రిల్ ఇస్తుంది. ఒక అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి..ఇలా వరుసగా హత్యలకు గురైన అమ్మాయిలను చూపించడం..వంటి ఆసక్తి రేపే అంశాలను స్పార్క్ ట్రైలర్ లో డైరెక్టర్ చూపించారు. అంతేకాకుండా ఈ మర్డర్స్ ను చేసింది హీరో అన్నట్లు కూడా చూపించడంతో ..ఆడియాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడేవారు ఈ మూవీని చూడొచ్చు.
హేషామ్ అబ్దుల్ మ్యూజిక్ :
హీరో విజయ్ దేవరకొండ ఖుషి ఫేమ్..హేషామ్ అబ్దుల్ వాహెబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తిగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ స్పార్క్ మూవీ పై అంచనాలు పెంచేస్తున్నాయి. పెద్ద సినిమాలు ..చిన్న సినిమాలు అనే తేడా లేకుండా హేశం అందించిన మ్యూజిక్ ఆడియాన్స్ ని థియేటర్లో మెస్మరైజ్ చేస్తోంది.
మై నేమ్ ఇజ్ శృతి
హన్సిక లీడ్ రోల్‌లో ఓంకార్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
స్టోరీ థీమ్ :
‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఒక సోషల్ ఇష్యూని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం. కంప్లీట్ స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది.
ఈ మూవీ ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. మెడికల్ మాఫియా, కిడ్నీ మాఫియా లాంటివి చూసుంటాం..కానీ ఇందులో స్కిన్ కు సంబంధించిన మాఫియాను చూపించబోతున్నారు.
ఎన్నో ఆశలతో..మారుమూల గ్రామాల్లోంచి అమ్మాయిలు పట్నం వచ్చి..మాఫియా ముసుగులో ఎలా చిక్కుకుంటే..తనకు తాను ఎలా కాపాడుకోవాలి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.