ఇక క్యాన్సర్ కణాలు వాటంతటవే చస్తయ్! మందును కనిపెట్టిన ఐఐసీటీ సైంటిస్టులు

ఇక క్యాన్సర్ కణాలు వాటంతటవే చస్తయ్! మందును కనిపెట్టిన ఐఐసీటీ సైంటిస్టులు
  • బ్రెస్ట్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ను నిర్మూలించే మందును కనిపెట్టిన ఐఐసీటీ సైంటిస్టులు 
  • కీమోథెరపీకి లొంగకుండా సవాల్‌‌‌‌గా మారిన ట్రిపుల్ నెగెటివ్ రకం బ్రెస్ట్ క్యాన్సర్ 
  • కాపర్ 3, కాపర్ 4 కాంపౌండ్లతో దానికి చెక్ పెట్టొచ్చని గుర్తింపు
  • ల్యాబ్ ట్రయల్స్‌‌‌‌ విజయవంతం

హైదరాబాద్, వెలుగు:  ట్రిపుల్ నెగెటివ్ రకం బ్రెస్ట్ క్యాన్సర్(టీఎన్‌‌‌‌బీసీ)కు హైదరాబాద్‌‌‌‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సైంటిస్టులు సరికొత్త పరిష్కారం కనిపెట్టారు. టీఎన్‌‌‌‌బీసీ కణాలు వాటంతట అవే చనిపోయేలా కొత్త మందును అభివృద్ధి చేశారు. అతి చవకైన, విరివిగా లభించే ‘కాపర్​’ కాంపౌండ్స్‌‌‌‌(వివిధ ఔషధాల సమ్మేళనాలు)తో ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు చెక్ పెట్టొచ్చని నిరూపించారు. 

టీఎన్‌‌‌‌బీసీపై ల్యాబ్‌‌‌‌లో నాలుగు కాపర్ కాంపౌండ్లతో పరీక్షించి చూడగా.. కాపర్​3, కాపర్​4 కాంపౌండ్లు మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు తేలింది. ఇవి క్యాన్సర్ కణాలను చంపడమే కాదు.. టీఎన్‌‌‌‌బీసీకి ఇప్పటికే వాడుతున్న ఆక్సాలిప్లాటిన్ మందు కన్నా మెరుగైన ప్రభావం చూపించినట్టు వెల్లడైంది. టీఎన్‌‌‌‌బీసీ మళ్లీ మళ్లీ ముదరడానికి కారణమయ్యే ఆ క్యాన్సర్ మూలకణాలను కాపర్ 3, కాపర్ 4 కాంపౌండ్లు నిర్మూలించినట్టు ల్యాబ్ స్టడీస్‌‌‌‌లో తేలింది. కణాల పునరుత్పత్తికి లింక్ అయి ఉన్న త్రీడీ ట్యూమర్ స్ఫీరాయిడ్లను కాపర్​ కాంపౌండ్లు బ్లాక్ చేశాయి. 

క్యాన్సర్ కణాలు ఇతర ప్రాంతాలకు వ్యాపించి రోగం మరింత ముదిరేందుకు దారితీసే ప్రాసెస్‌‌‌‌ను ఆ కాంపౌండ్లు అణచివేశాయి. ఇక, ఈ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లో అత్యంత కీలకమైన మరో ప్రాసెస్‌‌‌‌ను కూడా ఈ కాపర్ కాంపౌండ్స్ అధిగమించాయి. టీఎన్‌‌‌‌బీసీలో కీమోలో వాడే ఔషధాలను.. ఏబీసీజీ2, ఏబీసీసీ1 అనే పంపులు బయటకు విసిరిపారేస్తుంటాయి. ఈ కాపర్ కాంపౌండ్స్​ఆ పంపులను బ్లాక్ చేసి.. మందులను బయటకు ఎగ్జిట్ చేయించే డోర్స్‌‌‌‌ను పూర్తిగా బ్లాక్ చేయడం విశేషం. దీనివల్ల కీమోలో వాడే మందులు క్యాన్సర్ కణాలపై దాడి చేసి వాటిని నిర్మూలించేందుకు అవకాశం లభిస్తుంది.  

కణాలు వాటంతటవే చచ్చేలా..

టీఎన్‌‌‌‌బీసీలో క్యాన్సర్ కణాలు తమంతట తామే చచ్చేలా కాపర్ కాంపౌండ్స్ పని చేశాయని ఐఐసీటీ ల్యాబ్ పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్ కణాల సైకిల్‌‌‌‌ను నిలుపుదల చేయడంతో పాటు.. ఆపాప్టాసిస్ (కణాల ఆత్మహత్య)జరిగేలా ఇవి పని చేశాయని తేలింది. రియాక్టివ్ ఆక్సిజన్‌‌‌‌ను క్యాన్సర్ కణాలమీద దాడి చేసేలా చేయడంతో పాటు.. అపాప్టాసిస్‌‌‌‌ను నియంత్రించి క్యాన్సర్ కణాలు బతికేందుకు కారణమయ్యే బీఏఎక్స్, బీసీఎల్2, సర్వైవిన్ వంటి ప్రొటీన్లను బ్లాక్​ చేయడం ద్వారా టీఎన్‌‌‌‌బీసీని అడ్డుకున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతానికి ఇది ల్యాబ్ స్టడీలకే పరిమితం. దీనిపై క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

20 శాతం అలాంటివే..

బ్రెస్ట్ క్యాన్సర్లలో 15 నుంచి 20 శాతం వరకు టీఎన్‌‌‌‌బీసీ రకమే ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మందులు, కీమోలకు లొంగకుండా వేలాది మందిని ఈ క్యాన్సర్లు బలి తీసుకుంటున్నాయి. క్యాన్సర్ మందుల టార్గెట్‌‌‌‌లైన మూడు ప్రొటీన్లపై మందులు పని చేయకపోవడం వల్లే దీనికి ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని పేరొచ్చింది. మామూలుగా క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ఆ కణాల్లోని ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్టిరాన్ రిసెప్టర్, హర్ 2 (హ్యూమన్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్)లు టీఎన్‌‌‌‌బీసీలో ఉండవు. 

ఫలితంగా క్యాన్సర్ మందులు టీఎన్‌‌‌‌బీసీపై ప్రభావం చూపించలేకపోతున్నాయి. కీమోథెరపీ చేసినా ఫలితం ఉండడం లేదు. ఈ రకమైన క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లోని మూల కణాలే.. ఆ క్యాన్సర్ తీవ్రతకు కారణమవుతున్నాయి. కీమో చేసినా మళ్లీ పుడుతున్నాయి. వేగంగా వ్యాపించడంతో పాటు అంతేవేగంగా శరీరంలో వృద్ధి చెందుతున్నాయి.