ఎయిర్‌‌పోర్టలు, షాపింగ్‌ మాల్స్‌లోనూ ఫాస్ట్‌ట్యాగ్‌

ఎయిర్‌‌పోర్టలు, షాపింగ్‌ మాల్స్‌లోనూ ఫాస్ట్‌ట్యాగ్‌
  • త్వరలోనే ప్రవేశపెట్టనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నేషనల్‌ హైవేల్లోని టోల్‌ప్లాజా, రింగ్‌రోడ్డుల్లోని టోల్‌ప్లాజాల దగ్గర ఇప్పటికే అమల్లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ పద్ధతిని త్వరలోనే విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్‌లో కూడా ప్రవేశపెట్టనున్నారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫాస్ట్‌ట్యాగ్‌ సహకారంతో 100 శాతం కాంటాక్ట్‌లెస్‌, ఇంటర్‌‌అపరబుల్‌ పార్కింగ్‌ పరిష్కారాలను విస్తరించేందుకు దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌‌పోర్ట్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో ఫాస్ట్‌టాగ్‌ తీసుకురావాలని ఎన్‌పీసీఐ ఈ చర్యలు చేపట్టింది. దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాల్లోని విమానాశ్రయాలు, మాల్స్‌లోని ప్రధాన పార్కింగ్‌ ప్రైవేట్‌ కార్‌‌పార్కింగ్‌ ఏరియాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ సౌకర్యం లభించనుంది. జీఎమ్‌ఆర్‌‌ హైదరాబాద్‌ విహానాశ్రయంలో ఈ సౌకర్యం ఇప్పటికే అమల్లో ఉంది. ప్రధాన బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులపై ఆసక్తి చూపించాయి. ప్రంపచస్థాయి కస్టమర్‌‌ అనుభవాలకే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో తమ బ్యాంక్ ఎప్పుడూ ముందు ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ చెప్పింది.