కరెంటు బిల్లులు అమెజాన్​లోనూ కట్టొచ్చు

కరెంటు బిల్లులు అమెజాన్​లోనూ కట్టొచ్చు

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ఎస్​పీడీసీఎల్​ కస్టమర్స్ ఇక నుంచి కరెంటు బిల్లులను అమెజాన్​ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఈ మేరకు తెలంగాణ సదరన్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్​ఎస్​పీడీసీఎల్​)తో ఒప్పందం కుదుర్చుకున్నామని అమేజాన్ పే ప్రకటించింది. కన్వీనియెన్స్ ఫీజు లేకుండా  బిల్లులను చెల్లించవచ్చు. మొదటి బిల్లు చెల్లింపు పై  క్యాష్ బ్యాక్స్ పొందవచ్చు. బిల్స్​ చెల్లింపు కోసం అమెజాన్​ యాప్​లో  అమేజాన్ పే ట్యాబ్ పై  క్లిక్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్​పేజీకి రావడానికి ఎలక్ట్రిసిటీ ఐకాన్ పై క్లిక్ చేయాలి.

రాష్ట్రంగా "తెలంగాణ", ఎలక్ట్రిసిటీ బోర్డ్ గా టీఎస్​ఎస్​పీడీసీఎల్​ను ఎంచుకోవాలి. యూఎస్​సీ ఎంటర్​ చేయగానే, ఇప్పుడు బిల్లు మొత్తం కనిపిస్తుంది. యూపీఐ, అమేజాన్ పే లేటర్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, అమేజాన్ పే బ్యాలెన్స్, లేదా నెట్-బ్యాంకింగ్ వంటి ద్వారా డబ్బు కట్టవచ్చు. మహబూబ్ నగర్, నారాయణ పేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యపేట, సిద్ధిపేట, మేడ్చల్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, వికారాబాద్  రంగారెడ్డిలు టీఎస్​ఎస్​పీడీసీఎల్ పరిధిలోకి వస్తాయి.