లండన్ రోడ్ మ్యాప్తో సీఎం కేసీఆర్ ముఖచిత్రం

 లండన్  రోడ్ మ్యాప్తో సీఎం కేసీఆర్ ముఖచిత్రం

లండన్‌కు చెందిన తెలంగాణ సైక్లిస్ట్ మల్లా రెడ్డి బీరం అనే వ్యక్తి  సీఎం కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.  సీఎం కేసీఆర్ చిత్రాన్ని లండన్‌ నగరంలో వినూత్నంగా చిత్రీకరించాడు. అందుకు లండన్‌ వీధుల్లో 6 గంటల కంటే తక్కువ టైమ్ లో సుమారు 88 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు.  అయితే మనోడు ట్రావెల్ చేసిన రూట్లను కలిపితే  సీఎం కేసీఆర్ ముఖచిత్రం వచ్చింది. 

కేసీఆర్‌ రైడ్‌ పేరిట అతను రోడ్లపై సైకిల్‌ తొక్కుతున్న సమయంలో గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ వాడాడు.  అందుకు ముందుగా సెలక్ట్‌ చేసుకున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సైకిల్‌ తొక్కాడు.  మొత్తం పూర్తయిన  తర్వాత అతను ప్రయాణించిన మార్గాన్ని గూగుల్‌ మ్యాపింగ్‌ చేశాడు. ఇలా అన్ని మార్గాలను కలుపగా అచ్చంగా కేసీఆర్‌ ముఖచిత్రం వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడిది వైరల్ గా మారింది.  

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. మచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రజా ఆశీర్వాధ సభలతో సీఎం కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటిస్తుంటే.. మంత్రుల కేటీఆర్, హరీష్ రావులు రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు.