విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : నీరటి రాంప్రసాద్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : నీరటి రాంప్రసాద్

లక్సెట్టిపేట, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ డిమాండ్​చేశారు. శుక్రవారం లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్​హౌజ్ ఆవరణలో ఎన్ఎస్ఎఫ్ నాయకుల సమావేశం నిర్వహించగా రాంప్రసాద్​హాజరై మాట్లాడారు. విద్యారంగంలో అనేక సమస్యలతో స్టూడెంట్లు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి చదువులు పూర్తిచేసినా ఫీజు రియింబర్స్​మెంట్, స్కాలర్​షిప్స్ రాకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్యకు పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, వర్షాల నేపథ్యంలో అన్ని సంక్షేమ వసతిగృహాల్లో రెగ్యులర్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. మండల నాయకులు అభిలాష్, కార్తిక్, రాజేశ్, క్రాంతి పాల్గొన్నారు.