
సీఎం కేసీఆర్ వెంటనే టీఎస్ పీఎస్సీ(TSPSC) ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్ యూఐ నేత బల్మూరి వెంకట్. లేకపోతే మంత్రులను అధికారులను ఎక్కడిక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రూప్ 1 రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. గ్రూప్ 1 లో బయోమెట్రిక్ విధానం లేకపోవడం,అవకతవకలు జరిగాయని భావించి హైకోర్టు రద్దు చేసిందని.. విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
టీఎస్ పీఎస్ సీ(TSPSC) ప్రక్షాళన చేసి మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు యధావిధిగా నిర్వహించాలని సూచించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 రద్దుతో ఆందోళన చేస్తున్న విద్యార్థులది న్యాయపోరామని చెప్పారు.
జూన్ 11న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎగ్జామ్స్ ను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది