ఎన్టీపీసీలో 300 బిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి

ఎన్టీపీసీలో 300 బిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి

జ్యోతినగర్, వెలుగు : దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ సంస్థ గ్రూప్ అన్ని ప్రాజెక్టుల్లో 300 బిలియన్  యూనిట్ల కరెంట్  ఉత్పత్తి చేసిందని ఎన్టీపీసీ అధికార వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. 2023–-24 ఆర్థిక సంవత్సరం 262 రోజుల్లోనే ఈ మైలురాయి ని సాధించడంపై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

2032 ఆర్థిక సంవత్సరానికి 60 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం సాధించాలనే లక్ష్యంతో నిర్మాణ సామర్థ్యాలు పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ఈ మొబిలిటి,వేస్టు టు ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్  సొల్యూషన్స్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్  పంపిణీ కోసం భిన్నమైన ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపడుతూ కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు. నాణ్యమైన, నమ్మదగిన విద్యుత్  పంపిణీ చేప్తామని పేర్కొన్నారు.