త్వరలోనే పట్టాలెక్కనున్న జూ.ఎన్టీఆర్ న్యూ మూవీ

త్వరలోనే పట్టాలెక్కనున్న జూ.ఎన్టీఆర్ న్యూ మూవీ

యంగ్ టైగర్ ‘జూనియర్ ఎన్టీఆర్’ కొత్త సినిమా ప్రారంభమౌతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనంతరం తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ ‘కొరటాల శివ’తో ఓ సినిమాకు ఎన్టీఆర్ ఒకే చెప్పారు. కానీ.. ఇప్పటిదాక దీనికి సంబంధించిన విషయాలు బయటకు రాకపోవడవ, ఈ సినిమా ఉండదనే పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ కల్పించే న్యూస్ ను NTR Arts ఓ ట్వీట్ చేసింది. కొరటాల శివ, రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లు చర్చించుకుంటున్న ఫొటోలను పోస్టు చేసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించింది.

సినిమా కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరుగుతాయని సమాచారం. అయితే.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది తెలియడం లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ పతాకాలపై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. గతంలో జూ.ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్అయ్యింది. మళ్లీ ఇదే కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండడంతో అటు నందమూరి అభిమానులు ఇటు జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.