ఎన్టీఆర్ కొత్త మూవీ దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 27న ధియేటర్లలో సందడి చేయబోతున్న మూవీపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ట్రైలర్ పాజిటివ్ టాక్ రాగా.. మూవీలోని డైలాగ్స్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయ్.. ఒకటికి రెండు సార్లు దేవర డైలాగ్స్ ను పదేపదే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ లో ఫ్యాన్స్ రక్తం మరిగిస్తున్న ఎన్టీఆర్ డైలాగ్స్ ఇవే.. ఇక మూవీలో ఇంకెన్ని ఉంటాయో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్...
ALSO READ | DevaraTrailer: దేవర ట్రైలర్ రిలీజ్..భయం, కోపం..ఓ భయంకరమైన విశ్వరూపం
>>> కులం లేదు.. మతం లేదు.. భయం అసలే లేదు
>>> ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి
>>> రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ
>>> మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత దైర్యం కాదు
>>> కాదూ కూడదు అని మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..
>>> దేవరను చంపాలంటే సరైన సమయం కాదు.. సరైన ఆయుధం దొరకాలి
>>> వాడికి వాళ్లయ్య రూపం వచ్చింది కానీ.. రక్తం రాలేదే..
>>> పని మీదు పోయినోడు అయితే పనవ్వగానే వస్తాడు.. పంతం పట్టిపోయాడు నీ కొడుకు