
ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రాక కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, మరోవైపు తారక్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నారు. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లోనే స్టార్ట్ అవ్వాల్సిన ఈ మూవీ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు పోస్ట్‌పోన్ అవడంతో ఆలస్యమైంది. ఫిబ్రవరి 7న ఈ మూవీ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ ప్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా ఆలియాభట్ నటించనుంది. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇందులో స్టూడెంట్‌గా నటించనున్నాడట ఎన్టీఆర్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’లోనూ ఎన్టీఆర్ కాసేపు స్టూడెంట్‌గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో బస్తీలో ఉండే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వంతో పోరాడే స్టూడెంట్ లీడర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నాడని టాక్. ఇదే నిజమైతే ‘నాగ’ తర్వాత ఆ బ్యాక్‌డ్రాప్‌లో మళ్లీ ఎన్టీఆర్ నటించబోయే సినిమా ఇదే కానుంది. మొత్తానికి కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది.