ఆకలి, వేస్టేజ్​.. ఈ రెండు ప్రాబ్లమ్స్​కి సొల్యూషన్​ ఒక్కటే

ఆకలి, వేస్టేజ్​.. ఈ రెండు ప్రాబ్లమ్స్​కి సొల్యూషన్​ ఒక్కటే

ప్రతిరోజూ ప్రపంచంలో 800మిలియన్​ ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఆకలి సమస్య ఒకవైపు ఉంటే.. ఫుడ్ వేస్టేజ్ మరోవైపు. పోయినేడాది లెక్కల ప్రకారం.. మనదేశంలో ఒక మనిషి, ఏడాదికి 50 కిలోల ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు. అదే అమెరికాలో అయితే, ఒక యావరేజ్​ ఫ్యామిలీ సంవత్సరానికి1500 డాలర్లకు సరిపడా ఫుడ్ వేస్ట్​ చేస్తోంది. ఆ వేస్టేజ్​లో... వండి తినకుండా పాడయ్యేవి కొన్ని.. కొనుక్కొచ్చి వాడకుండానే పడేసేవి ఇంకొన్ని. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ వండిన వంటలు తినబుద్ధికాక, ఫుడ్ డెలివరీలు పెట్టుకోవడం వల్ల వేస్ట్ ఎక్కువ అవుతోంది. కాకపోతే ఇలా కావాలని చేయకపోయినా బిజీ లైఫ్​లో ఫుడ్​ ప్రిపేర్ చేసేందుకు టైం దొరకదు. ఇంకొందరేమో టైం లేదని తినకుండా వెళ్లిపోతుంటారు. 

అంతేకాదు, పెద్దవాళ్లు ఫుడ్ పడేయడం చిన్నవాళ్లు చూస్తే, వాళ్లకూ అదే అలవాటైపోతుంది. ఈ  అలవాటు కూడా వారసత్వంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎలాగైతేనేం మొత్తానికి ఫుడ్ వేస్ట్ అనేది ఇలా ఎన్నో రకాలుగా అవుతోంది. ఈ వేస్టేజ్​ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆకలి, వేస్టేజ్​.. ఈ రెండు ప్రాబ్లమ్స్​కి సొల్యూషన్​గా ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. దాని పేరు ‘నడ్జ్​ ట్యాగ్ సిస్టమ్’. 

ఇది చౌకగా దొరికే స్మార్ట్ ట్యాగ్. వాటర్ డ్రాప్​ షేప్​లో ఉంటుంది. దానికున్న సెన్సర్​ లైట్​ వల్ల ఫుడ్ ఎక్స్​పైరీ డేట్ తెలుసుకోవచ్చు. మరి ఇంట్లో లేనప్పుడు ఎలా తెలుస్తుంది? అంటే.. ఇప్పుడున్న టెక్నాలజీతో మనిషి హార్ట్ బీట్, ఆక్సిజన్​ లెవల్స్​ వంటివి స్మార్ట్​ వాచ్​లు, ఫోన్​ల ద్వారా తెలుసుకుంటున్నారు. అలాగే ఫ్రిజ్​లో లేదా కిచెన్​లో పెట్టిన ఏ ఫుడ్  అయినా పాడవబోతోందంటే వెంటనే సిగ్నల్ ఇస్తుంది ఈ ట్యాగ్. ఇంట్లో లేకపోయినా, ఫోన్​కి అలర్ట్ మెసేజ్​ వస్తుంది. ఇదంతా కరెక్ట్​ ప్రాసెస్​లో జరగాలంటే... ఒక ఐటమ్​ని ఎన్నిరోజుల్లో వాడుకోవాలో ముందుగానే ఒక రౌండ్ సెన్సర్​ బోర్డ్​కి సెట్ చేసి పెట్టాలి. ట్యాగ్​ని ప్రెస్​ చేసి సెట్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్​ని ట్రాన్స్​ఫర్ చేయాలి. ఆ ట్యాగ్​ని ఫుడ్ ఐటమ్​కి అతికించాలి లేదా తగిలించాలి. అప్పటి నుంచి ట్యాగ్ తన పని స్టార్ట్​ చేస్తుంది. ఫ్రిజ్​ ఓపెన్​ చేసినప్పుడు ఏ ఫుడ్​ పాడవ్వడానికి రెడీగా ఉందో దాని ట్యాగ్​ కలర్ మారుతుంది. అంటే ఫస్ట్ సెట్ చేసినప్పుడు గ్రీన్​ కలర్​లో ఉన్న ట్యాగ్... టైం అవుట్ అవగానే ఎల్లో కలర్​లోకి మారుతుంది. ఆ విధంగా దేన్ని ముందు వాడాలో తెలుస్తుంది. దీనికి సంబంధించిన యాప్​ ఫోన్​లో ఉంటుంది. కాబట్టి దాని ద్వారా అలర్ట్ మెసేజ్​లు వస్తాయి. అంతేకాకుండా ఈ యాప్​ ద్వారా పేదలకు ఫుడ్ అందించే ఫెసిలిటీ కూడా ఉంది. అదెలాగంటే... వేస్ట్ కాకుండా ఆపిన ఫుడ్ పర్సంటేజ్​ని అవసరమైనవాళ్లకు అందించేందుకు డొనేట్ ఆప్షన్ క్లిక్​ చేస్తే సరిపోతుంది.