
న్యూఢిల్లీ : మన దేశంలో బిలియనీర్లు తగ్గారు. 2019–20లో 141 మంది బిలియనీర్లు ఉండగా, 2020–21 నాటికి 136 మందికి తగ్గిపోయారు. ఇన్‌కంటాక్స్ రిటర్న్‌లోని గ్రాస్ టోటల్ ఇన్‌కం ఆధారంగా బిలియనీర్ల సంఖ్య లెక్కకట్టినట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌కు వెల్లడించారు.2018–19లో 77 మంది మాత్రమే రూ. 100 కోట్లకు (ఒక బిలియన్) మించి టోటల్ ఇన్‌కం ప్రకటించినట్లు తెలిపారు. డైరెక్ట్ టాక్సెస్ కింద బిలియనీర్ల పదానికి డెఫినిషన్ ఏదీ సీబీడీటీ వద్ద లేదని, ఎందుకంటే 2016 లో వెల్త్ టాక్స్‌ను రద్దు చేయడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ను సీబీడీటీ సేకరించడం లేదని స్పష్టం చేశారు. పేదరికం గురించి ప్రస్తావిస్తూ, టెండూలర్కర్ కమిటీ మెథడాలజీ ప్రకారం దేశంలో 2011–12 నాటికి 27 కోట్ల మంది బిలో పావర్టీ లైన్(బీపీఎల్) ప్రజలు ఉన్నారని మంత్రి చెప్పారు. ఇన్ఫ్లేషన్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలను అదుపులో ఉంచేందుకు తగిన చర్యలనూ తీసుకుంటున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. డిమాండ్– సప్లయ్‌లను జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నామన్నారు. జులై 15 నాటికి మొత్తం 1.33 లక్షల మందికి కొవిడ్ 19 ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ బ్యాంకులు అన్సెక్యూర్డ్ లోన్లను ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.