కోటి దాటిన ఉక్రెయిన్ శరణార్థుల సంఖ్య 

కోటి దాటిన ఉక్రెయిన్ శరణార్థుల సంఖ్య 

రష్యా ముప్పేట దాడులతో ప్రాణభయంతో ఉక్రెయిన్ దేశం విడుస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాల ఒత్తిడి... జోక్యంతో మానవతా కారిడార్లు ఏర్పాటు చేస్తుండడంతో అనేక మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడుస్తున్నారు. కొన్ని మానవతా కారిడార్లపై రష్యా దాడులు చేస్తుండడంతో ఎక్కడ తమపై బాంబులు పడతాయోనన్న భయం వెంటాడుతున్న పరిస్థితుల్లో దేశం విడిచి పిల్లా పాపలు, కట్టుబట్టలతో బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. 
రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు.. పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ హెచ్సీఆర్) హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండీ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులతో వినాశనం జరుగుతోందని.. లక్షల మంది కట్టుబట్టలతో ఇల్లు.. ఊరు విడిచి వెల్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎప్పుడు.. ఎక్కడ యుద్ధం జరిగినా సామాన్య ప్రజలే కష్టాలు పడతారని, గత్యంతరం లేక ఇళ్లు విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

భగవంత్ మాన్ మూడు రోజుల్లో గొప్ప పని చేశాడు

బ్రిటీష్​ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలి

అలా చేస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటా..