స‌మాన జీతం ఇవ్వాలంటూ న‌ర్సుల ధ‌ర్నా

స‌మాన జీతం ఇవ్వాలంటూ న‌ర్సుల ధ‌ర్నా

హైద‌రాబాద్: గత 13 సంవ‌త్స‌రాలుగా డ్యూటీ చేస్తున్న త‌మ‌కు త‌క్కువ జీతం ఇస్తుండ‌గా.. కొత్త‌గా తీసుకుంటున్న వారికి భారీ వేత‌నాలతో రిక్రూట్ చేస్తున్నారంటూ ధ‌ర్నాకు దిగారు న‌ర్సింగ్ సిబ్బంది. శుక్ర‌వారం కోఠిలోని డిఎంఈతో పాటు ప‌లు హాస్పిట‌ల్స్ ముందు సిర‌స‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా క్ర‌మంలో రీసెంట్ గా తీసుకున్న నర్సింగ్ సిబ్బందికి రూ.25 వేల జీతం ఇస్తున్నారన్నారు. అలాగే ఐదు సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉన్న సిబ్బందికీ హెడ్ న‌ర్స్ పోస్టు ఇచ్చి, రూ. 28 వేల జీతం చెల్లిస్తున్నారని తెలిపారు. కానీ గత 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నర్సింగ్ సిబ్బందికి మాత్రం, రూ.17వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు కూడా స‌మాన జీతం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు పాత న‌ర్సింగ్ సిబ్బంది.