
హైదరాబాద్ : కాచిగూడలో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యమైంది. యాదగిరిగుట్టకు చెందిన సీహెచ్ కోమలత(18) నాగోల్‌లోని కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఈ నెల 14న నింబోలిఅడ్డలోని మేనత్త ఇంటికి వచ్చింది. కోమలత ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది, కానీ ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబుచేసినా ఆచూకీ లభించలేదు. తండ్రి యాదగిరి కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాడు చేశాడు.