లావెక్కుతున్న సౌతాఫ్రికా

లావెక్కుతున్న సౌతాఫ్రికా
  • జంక్ ఫుడ్డే ప్రధాన కారణం

సౌతాఫ్రికా హెల్త్ పరంగా ప్రమాదపు అంచున ఉంది. ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ కొత్త కాదు.మిగతా దేశాలతో పోలిస్తే హెచ్ ఐ వీ ఇక్కడ చాలా ఎక్కువ. అయితే  గ్లో బల్ వెల్ నెస్ ఇండెక్స్  సంస్థ తాజా రిపోర్ట్ ప్రకారం దక్షిణాఫ్రికాలో అంటువ్యాధులు కాని రోగాలు ( నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ) ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో ఒబేసిటీ మరింత స్పీడుగా పరుగులు తీస్తోంది. ఒక్క సౌతాఫ్రికాలోనే కాదు ఆఫ్రికాలోని అన్ని దేశాల్లో నూ ఇదే పరిస్థితి ఉన్నట్లు ‘ గ్లో బల్ వెల్ నెస్ ఇండెక్స్ ’ లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించిం ది. సౌతాఫ్రికా విషయానికొస్తే పెద్దవారిలో 46 శాతం మంది ఒబేసిటీ తో ఇబ్బందులు పడుతున్నట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. రిస్క్ ఫ్యాక్టర్ గా భావిం చే ఒబేసిటీ పెరగడం పట్ల హెల్ త్ఎక్స్ పర్స్ట్ ఆందోళన పడుతున్నారు.ఈ ప్రభావం ప్రజల ఆయుర్దాయం పై పడుతుం దని డాక్టర్లు హెచ్చరిం చారు.‘ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ’ ( డబ్ల్యుహెచ్ ఓ ) లెక్కల ప్రకారం ‘ నాన్ కమ్యూని కబుల్ డిసీజెస్ ’ పంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 41 మిలియన్ ప్రజల ఉసురు తీస్తున్నాయి. అంటే ప్రపంచంలో 71 శాతం చావులకు ఈ రోగాలే కారణమవుతున్నాయి. ఈ లిస్టులో హార్ట్‌‌‌‌‌‌‌‌ప్రాబ్లమ్స్ , కేన్సర్,శ్వాసకోస వ్యాధులు, డయాబెటిస్ కూడాఉన్నాయి. పొగాకు వాడకం, శరీరానికి తగినంత ఎక్సర్ సైజ్ లేకపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం,అనారోగ్యానికి దారితీసే ఆహారపు అలవాట్లు …ఇవన్నీ ఈ రోగాలను పెం చుతున్నాయంటున్నారు ఆరోగ్య రంగ నిపుణులు.

ఆర్థిక పరిస్థి తిని దెబ్బతీస్తున్న వ్యాధులు……

నాన్ కమ్యూని కబుల్ వ్యాధుల ప్రభావం కేవలం మనిషి ఆరోగ్యం పైనే పడటం లేదు. మొత్తంగా ఆ కుటుం బ ఆర్థిక పరిస్థితినే తల్లకిం దులు చేస్తోంది.దాచుకున్న డబ్బు లన్నీ డాక్టర్ల ఫీజులకే పెట్టాల్సి వస్తోంది. పేదల పరిస్థితి మరీ దారుణంగా మారిం ది. రోగమొస్తే ట్రీట్మెం ట్ చేయిం చుకోవడానికి కూడా సొమ్ముల్లేని దయనీయ పరిస్థితి. దీం తో తెలిసిన వాళ్ల దగ్గర అప్పలు చేసి మరీ ట్రీట్మెం ట్ తీసుకుం టున్నారు. కొన్నిసార్లు ముక్కూ మొహం తెలియనివారి దగ్గర నుంచి కూడా డబ్బు ల కోసం చేయి చాచాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యం లో రోగాల బారిన పడుతున్న కుటుం బాలను ఆదుకోవడానికి కెన్యాలో ప్రజలు ముం దుకు వచ్చారు. ‘ హరాం బీ ’పేరుతో ఒక సపోర్ట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అలా అని వీళ్లంతా డబ్బు లున్నోళ్లు కారు…పేదలే. అందరి బాగు కోసం మేము అంటూ ఓ ఉద్యమంలా ముం దుకు కదులుతున్నారు.

ఒబేసిటీ పై అవగాహన పెం చాలి….

ఒబేసిటీ పై ప్రజల్లో అవగాహన పెం చాల్సి న అవసరం ఉందన్నారు ఆరోగ్య రంగ నిపుణులు. చాలా ఆఫ్రికా దేశాల్లో హెల్త్ పరంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యం పై మెజారిటీ ప్రజలకు అవగాహన లేదు. ఏం తినాలో….ఏం తినకూడదో కూడా తెలియని స్థాయిలో ప్రజలున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. హెల్త్ క్యాం ప్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన పెం చాలని హెల్త్ కేర్ ఇండస్ట్రీ వర్గాలు , సౌతాఫ్రికా సర్కార్ కు సూచించింది.