తెలంగాణ లో ఎన్నికలు పకడ్బందీగా  నిర్వహించాలి : అజయ్ వి. నాయక్

తెలంగాణ లో ఎన్నికలు పకడ్బందీగా  నిర్వహించాలి : అజయ్ వి. నాయక్

సంగారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్షన్ అబ్జర్వర్ అజయ్ వి. నాయక్,  పోలీస్ స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అన్నారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలపై సూచనలు, సలహాలు అందించారు.

కలెక్టర్ శరత్ ఎన్నికల ఏర్పాట్లపై అబ్జర్వర్లకు వివరించారు. జిల్లాలో ఓటర్ల సంఖ్య,  స్వీప్ కార్యక్రమాలు, ఇప్పటివరకు సీజ్ చేసిన మద్యం, నగదు వివరాలను అందించారు. ఎస్పీ రూపేశ్​శాంతి భద్రతలకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు పవన్ కుమార్,  దీపక్ సింగ్లా, ఎన్నికల వ్యయ పరిశీలకులు నజీమ్ జై ఖాన్, అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అడిషనల్​ఎస్పీ అశోక్, డీఆర్​ఓ నగేశ్,  ఆయా నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

మెదక్ టౌన్:  జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా, నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్​ అబ్జర్వర్​ సంతోష్​ కుమార్ తుకారామ్ తెలిపారు.​శనివారం పట్టణంలోని పోలీస్​ కమాండ్​ కంట్రోల్​రూమ్​ను ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే అధికారులు ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ సందీప్​రెడ్డి, నాగేశ్వర్​రావు, కమాండ్​ కంట్రోల్​ సిబ్బంది ఉన్నారు.

ఓటర్ స్లిప్‌‌ల పంపిణీ స్పీడప్ చేయాలి

నర్సాపూర్: ఓటర్ స్లిప్‌‌ల పంపిణీ స్పీడప్​ చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్వో లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటికి తిరిగి రోజుకు 200 ఓటర్ స్లిప్ లు పంపిణీ చేయాలన్నారు. వీటితో పాటు ఓటర్ గైడ్, సి విజిల్ పాంప్లేట్స్​ను కూడా అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్, ఆర్ఐ ఫైజల్, సూపర్వైజర్ విజయలక్ష్మి, బీఎల్ఓ మౌనిక, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.