కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం : ఒడిశా సీఎం

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం : ఒడిశా సీఎం
  • ఒడిశా సర్కారు సంచలన నిర్ణయం

భువనేశ్వర్: ఒడిశాలోని 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ శనివారం ప్రకటించారు. దీనికి సంబం ధించిన నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్టు రిక్రూట్‌ మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో దీపావ‌ళి ముందుగానే వ‌చ్చిన‌ట్లు అయిందని న‌వీన్ ప‌ట్నాయ‌క్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.1,300 కోట్ల భారం పడుతుందన్నారు. త‌న 76వ పుట్టిన‌రోజు (అక్టోబర్ 16)ను పురస్కరించుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సీఎం ప్రకటనతో ఒడిశా వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.