పాసిగామ గ్రామంలో 869 ట్రాక్టర్ల ఇసుక డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్వాధీనం

పాసిగామ గ్రామంలో  869 ట్రాక్టర్ల ఇసుక డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్వాధీనం

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో డంప్ చేసిన సుమారు 869 ట్రాక్టర్ల ఇసుక డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆఫీసర్లు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం స్థంభంపల్లి, పాసిగామ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై మైనింగ్, రెవెన్యూ, పోలీసులు ఆదివారం దాడులు చేశారు.

స్తంభంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్దు సుమారు ఏడు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 700 ట్రాక్టర్ల ఇసుక, పాశీగాం గ్రామంలో నాలుగు చోట్ల నిల్వ చేసిన 169 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.