
బీర్కూర్, వెలుగు: నకిలీ విత్తనాలతో తాము నష్టపోయామని ఫిర్యాదు చేసిన బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన రైతుల పంట పొలాలను గురువారం అగ్రికల్చర్ ఆఫీసర్లు పరిశీలించారు. అనంతరం ఎడీఏ వీర స్వామి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎడీఏ వీరస్వామి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని, ఇక్కడ పరిశీలించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు. గ్రోమోర్ సిబ్బంది రైతులకు ఇచ్చిన ఆ సీడ్ ఎలాంటిదో శాస్త్రవేత్తలు పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఓ కమల, రైతులు ఉన్నారు.