కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు బదిలీ అయ్యారు. పర్సనల్, ఈఎం, ఫైనాన్స్ విభాగాలకు చెందిన కొందరిని బదిలీ చేస్తూ, మరికొందరికి ప్రమోషన్లు ఇస్తూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేట్ డీఎం ఎస్‌ఎస్‌బీ వింగ్ డీజీఎం పర్సనల్ చేతి అశోక్, కార్పొరేట్ ఆర్‌సీ డీజీఎం ప్రకాశ్‌రావు, మందమర్రి ఏరియా పర్సనల్ మేనేజర్‌శ్యాంసుందర్, మందమర్రి ఏరియా డీవైపీఎం ఎండి.ఆసిస్, డీవైపీఎం వడ్లకొండ సునీల్ ప్రసాద్, శ్రీరాంపూర్ ఏరియా సీనియర్ పీవో పి.కాంతారావు, కార్పొరేట్ ఆర్‌సీ, శాప్ ట్ సీనియర్ పీవోబానోత్ రాము, మణుగూరు ఏరియా సీనియర్ పీవో రామేశ్వర్‌రావు, కొత్తగూడెం జేవీఆర్2 ఓసీపీ సీనియర్ పీవో కల్వల దేవదాస్‌తో పాటు పలు డిపార్ట్‌మెంట్లకు చెందిన ఆఫీసర్లు, ఎస్ఈలు, డిప్యూటీ ఎస్‌ఈలు, ఈఈలు, జేఈలను బదిలీ చేస్తూ ఆర్డర్స్ జారీ అయ్యాయి.
