
రఘునాథపల్లి/ దంతాలపల్లి, వెలుగు: ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్ మండల ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌యాదవ్, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల షాప్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి విత్తన, ఎరువుల విక్రయాలపై ఆరా తీశారు. విత్తనాల కొనుగోలులో రైతులు, షాప్ నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.