కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలం ఆలుగామా గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాపై అధికారులు స్పందించారు. స్థానిక పాఠశాలకు ఎదురుగా ఉన్న సుమారు రెండెకరాల చెరువు శికం భూ ఆక్రమణపై శుక్రవారం ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన ‘‘చెరువు భూమికి ఎసరు’’ అనే కథనానికి రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించారు.
శనివారం తహసీల్దార్ మహేంద్రనాథ్, ఆర్ఐ రాజలింగు, సర్వేయర్ సాయికృష్ణ అక్కడికి చేరుకొని సర్వే చేసి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూ కబ్జాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ పోల్లు వేసి ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.