ఆక్రమణపై ఆఫీసర్ల సీరియస్

ఆక్రమణపై ఆఫీసర్ల సీరియస్
  • వెలుగు’ కథనానికి స్పందన 
  • విచారణకు ఆదేశించిన అడిషనల్​ కలెక్టర్ రోహిత్​ సింగ్​​

జనగామ, వెలుగు : జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్​లో బీఆర్​ఎస్​ ఆఫీస్​ అక్రమ నిర్మాణం పై అధికారులు స్పందించారు. ‘దర్జాగా కబ్జా’ పేరుతో ‘వెలుగు’లో  స్టోరీతో  ప్రచురితం కావడంతో జిల్లా యంత్రాంగం  కదిలింది. కబ్జాపై విచారణకు కలెక్టర్​ రోహిత్​ సింగ్​ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా సహించేది లేదన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీస్​ నిర్మాణంలో సర్కారు భూమి కబ్జాకు గురైనట్లు తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

జనగామ తహసీల్దార్​ను పూర్తి విచారణ చేసి,  నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు.  నివేదిక ఆధారంగా తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు. సర్కారు భూమిని కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. భూ ఆక్రమణలకు పాల్పడడంపై యశ్వంతాపూర్​ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనలు చేస్తామని, లేకుంటే ఆ స్థలంలో పేదలకు గుడిసెలు వేయిస్తామని అంటున్నారు.