Balakrishna,Pawan,Ntr: పవన్ని పక్కన పెట్టేసి బాబాయ్ లైన్ క్లియర్ చేసిన ఎన్టీఆర్

Balakrishna,Pawan,Ntr: పవన్ని పక్కన పెట్టేసి బాబాయ్ లైన్ క్లియర్ చేసిన ఎన్టీఆర్

దేశంలో ఎన్నికల హంగామా ముగియడంతో పెద్ద సినిమాలు ఒక్కోటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలుగులో సైతం భారీ సినిమాలు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకుంటున్నాయి. అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలపై అందరి దృష్టి పడింది. అవును.. అందులో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమా సెప్టెంబర్ 27న రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కానున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. 

అయితే తాజా సమాచారం మేరకు.. ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు దేవర యూనిట్ తాజాగా కొత్త అప్డేట్ కూడా ఇచ్చేశారు. అదేంటంటే.. దేవర సినిమాను అక్టోబర్ 10న కాకుండా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కారణం.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడమే. 

దాంతో.. ఆయనపై ఇప్పుడు బాధ్యత పెరిగింది. గెలిచినా వెంటనే.. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పవన్ కంప్లీట్ చేస్తారని అనుకున్నారు అంతా. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. రానున్న నెలరోజులు పవన్ కళ్యాణ్ బిజీగా గడపనున్నారు. అందుకే ఓజీ సినిమా వాయిదాకాక తప్పడం లేదు. అందుకే ఆ డేట్ న ఎన్టీఆర్ దేవర విడుదలకు ప్లాన్ చేశారు మేకర్స్. ఆమేరకు కొత్త విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. 

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ప్రస్తుతం అయన దర్శకుడు బాబీ కొల్లితో NBK 109 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. అదే సమయంల అక్టోబర్ 10 నుండి దేవర తప్పుకోవడంతో అదే డేట్ ను రావాలని చూస్తున్నాడట బాలకృష్ణ. దాదాపు అదే డేట్ కన్ఫర్మ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ విదంగా ఎన్టీఆర్ పవన్ ను పక్కకు నెట్టేసి బాలకృష్ణకు లైన్ క్లియర్ చేశాడు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూడు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.