
‘జో’ అనే తమిళ చిత్రంతో ఆకట్టుకున్న మలయాళ హీరోయిన్ మాళవిక మనోజ్.. ‘ఓ భామ అయ్యో రామ’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక మనోజ్. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకుడు. హరీష్ నల్ల నిర్మించారు.
2025 జులై 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మాళవిక మాట్లాడుతూ ‘తమిళ చిత్రం ‘జో’లో నా నటన చూసి ఈ సినిమాకు ఎంపిక చేశారు. కథ వినగానే చాలా డిఫరెంట్‌గా అనిపించింది.
గత చిత్రాల్లో సింపుల్ విలేజ్ గర్ల్‌గా కనిపించా. కానీ ఇందులో సత్యభామ అనే పాత్రలో ఎంతో మోడ్రన్‌గా, హైపర్‌గా, ఆటిట్యూడ్‌తో కనిపిస్తా. ఒక నటిగా ఇలాంటి వైవిధ్యమైన పాత్ర లభించడం హ్యాపీ.
స్విమ్మింగ్ రాకపోయినా షూట్ వాయిదా పడటం ఇష్టంలేక భయపడుతూనే ఆ సీన్‌లో నటించా. ఇక గ్లామరస్ రోల్స్, చేయాలా వద్దా అనే నిబంధన ఏమీ నాకు లేదు. కథ నచ్చి, నాకు కంఫర్టబుల్‌గా అనిపించిన రోల్స్ మాత్రమే చేస్తాను.
నన్ను నేను వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడం ఇష్టం. రొటీన్ క్యారెక్టర్స్ చేస్తే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. అందుకే చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది.