ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి ఓహ్ మేడమ్ సాంగ్‌‌ రిలీజ్

ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి ఓహ్ మేడమ్ సాంగ్‌‌ రిలీజ్

ఓ వైపు సీరియస్ సబ్జెక్టులు, మరోవైపు కామెడీ కథలతో  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు అల్లరి నరేష్. వాటిలో నరేష్ నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓహ్ మేడమ్’ అనే సాంగ్‌‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్  రిలీజ్ చేశాడు. గోపీ సుందర్  కంపోజ్ చేసిన ఈ పాటకు  భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడాడు. 

‘ఓయమ్మ కొంచెం ఆగవే.. మనసే చెప్పే మాటని పూర్తిగా వినరాదే.. నీబొమ్మ  మదిలో ఉన్నదే.. ఎన్ని జన్మ జన్మలకైనా చెరగదులే.. ఓహ్ మేడమ్ ఐయామ్ వెయిటింగ్ ఫర్  యూ’ అంటూ సాగిన పాటలో నరేష్, ఫరియా ట్రెండింగ్ లుక్‌‌లో ఆకట్టుకుంటున్నారు.  వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. మరోవైపు నరేష్ నటిస్తున్న చిత్రాల్లో ‘బచ్చలమల్లి’ మరొకటి.  ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు దర్శకుడు. ఈ మూవీ కీలక షెడ్యూల్‌‌ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.