కస్టమర్లకు Ola గుడ్ న్యూస్..ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25వేల తగ్గింపు

కస్టమర్లకు Ola గుడ్ న్యూస్..ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25వేల తగ్గింపు

ఈ-స్కూటర్ తయారీసంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్ 1 సిరీస్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ బైకులపై రూ.25 వేల వరకు తగ్గించినట్లు శుక్రవారం (ఫిబ్రవరి16) వెల్లడించింది. డిస్కౌంట్ ఫిబ్రవరి నెలలో మాత్రమే అమల్లోకి వస్తుందని ఓలా కంపెనీ తెలిపింది. 

Ola S1 ధరతోపాటు Ola S1 ఎయిర్ ధర కూడా రూ. 1.19 లక్ష ల నుంచి రూ. 1.05 లక్షలకు తగ్గించారు. Ola S1 ప్రో ధర ఇప్పుడు రూ.1.48 లక్షల నుంచి రూ. 1.30 లక్షలకు తగ్గించబడింది. ఇవన్నీ షోరూమ్ ధరలు. గత నెల (జనవరి)లో కూడా S1 X+ పై Ola Electric  రూ. 20వేల తగ్గింపును అందించింది. దీంతోపాటు S1ప్రో, S1 ఎయిర్ పై పొడిగించిన ఉచిత వారంటీ, ఎక్ఛేంజ్ బోనస్ , క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లను అందించింది. 

కస్టమర్లకు ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్ , నో కాస్ EMI , జీరో ప్రాసెసింగ్ ఫీజులు, ఆకర్షణీమైన 7.99 శాతం వడ్డీ రేటు ఉంటాయి. వినియోగదారులకు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మరింత ఆకర్షణీయంగా , ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా ఓలా ఆఫర్లను అందిస్తోంది. 

డిస్కౌంట్లతోపాటు అదనంగా Ola Electric S1 ఎయిర్, S1 ప్రో స్కూటర్ల కోసం బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల లేదా 80000 కి.మీ వారంటీని ఇస్తున్నారు. కస్టమర్లు అదనంగా రూ.5 వేల చెల్లిస్తే.. 1లక్ష కి.మీ పొడగించిన వారంటీని పొందొచ్చు. రూ.12,500 చెల్లించి 1.25 లక్షల కి.మీ. పొడిగించిన వారంటీని ఎంచుకోవచ్చు.