కొడుకులకు భారం కావొద్దని దంపతులు సూసైడ్.. సూర్యాపేట జిల్లా బోట్య తండా పంచాయతీలో ఘటన

కొడుకులకు భారం కావొద్దని దంపతులు సూసైడ్.. సూర్యాపేట జిల్లా బోట్య తండా పంచాయతీలో ఘటన
  • పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని అఘాయిత్యం 

సూర్యాపేట, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న  ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్(ఎస్) మండలం బోట్య తండా పంచాయతీకి చెందిన భూక్య లచ్చు (65), వీరమ్మ(60) దంపతులకు ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉండగా.. వీరికి పెండ్లిళ్లు చేశారు. 

కొన్నాళ్లుగా వృద్ధ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొడుకులకు భారం కావొద్దనుకుని ఆదివారం రాత్రి ఇంట్లో గడియ పెట్టుకుని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. చుట్టుపక్కలవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే వీరమ్మ మృతి చెందింది. లచ్చును సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుల కొడుకు భూక్య మోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.