పాత బట్టల మోడలింగ్ తో వృద్ధ జంట వైరల్ 

V6 Velugu Posted on Sep 13, 2020

ఓల్డ్ ఈజ్ గోల్డెహె !

కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత ఒకటి ఉంది. కానీ, దానికి సమానంగాఓల్డ్ ఈజ్ గోల్డ్అనే మరో మాట కూడా ఉంటుందికరెక్ట్గా ప్లాన్ చేస్తే పాత వాటితో కూడా కొత్తగా అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన వాళ్లూ ఉన్నారుతైవాన్‌‌లో వయసుమళ్లిన జంట అలాంటి ప్రయత్నంలోనే బిజీగా ఉంటోందిఇంతకీ వీళ్లు ఏం చేస్తున్నారనేగా?.  పాత బట్టలతో మోడలింగ్ చేస్తూ..  ఇంటర్నేషనల్ సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

సుషోర్​, ఛాంగ్ వాన్​ జీ.. ఈ ఇద్దరూ తైవాన్ వాళ్లు. వరల్డ్​వైడ్​గా గుర్తింపు దక్కించుకున్న మోడల్స్​. అలాగని వీళ్లిద్దరూ సెలబ్రిటీలేం కారు. టీనేజ్​ ఇన్​ఫ్లుయెన్సర్లు అంతకన్నా కాదు. ఇద్దరి వయసు 80 ఏండ్లకుపైనే ఉంటుంది. పైగా ఇద్దరూ భార్యాభర్తలు.  టైచుంగ్​ సెంట్రల్ సిటీలోని మామ్​ అండ్​ పాప్​ లాండ్రీ సర్వీస్ సెంటర్​ ఓనర్లు వీళ్లు​.  మరి ఇంత లేట్​ వయసులో ట్రెండియెస్ట్ మోడల్స్​గా వీళ్లకు పేరు ఎలా దక్కింది అంటారా? దాని వెనుక పాత బట్టల కథ బోలెడంత ఉంది.

మనవడి పని

84 ఏండ్ల సు షో ఎర్​, ఆమె భర్త 83 ఏండ్ల ఛాంగ్ వాన్ జీ (భార్య కంటే ఏడాది చిన్న) ఇద్దరూ ఆ దుకాణాన్ని నడిపిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తో లాండ్రీ సర్వీస్ సరిగ్గా నడవలేదు. దీంతో ఇద్దరూ దిగాలుగా ఉండేవాళ్లట. ఆ టైంలో వాళ్ల మునిమనవడు  రీఫ్​ ఛాంగ్(31).. ఆ ఇద్దరినీ సంతోషంగా ఉంచాలనుకున్నాడు. కస్టమర్లు వదిలేసిన కొన్ని బట్టల్ని తాత, బామ్మలకు తొడిగించి సరదాగా ఫొటోలు తీశాడు. వాటిని ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో అప్‌‌లోడ్​ చేయడంతో లైకుల మీద లైకులు వచ్చాయి. పాత బట్టలతో తమ ఫొటోలకు దక్కిన క్రేజ్​ గుర్తించిన షో ఎర్​ తన పాత పెట్టెను దులిపింది.  డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బట్టలు దాదాపు 400 జతలు బయటపడ్డాయట!!.  వాటిని దుమ్ము దులిపి వరుసగా ఆ జంట ఫొటోషూట్స్​ చేసింది. ‘వాట్​​షోయాజ్‌‌యంగ్’​ పేరుతో ఒక ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్ ఓపెన్​ చేసి.. అందులో ఆ ఫొటోల్ని పోస్ట్ చేశాడు రీఫ్​ ఛాంగ్. అక్కడి నుంచి ఆ ఓల్డ్ మోడలింగ్ కపుల్​కి ఫాలోయింగ్ మొదలైంది.

ఇంటర్నేషనల్ ఫేమ్​

ఈ ఓల్డ్ కపుల్ సెలక్షన్​కి రోజురోజుకీ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. కిందటి నెలలో తైవనీస్​ వోగ్ ఎడిషన్​, మేరీ క్లైయిర్​ అనే మరో ఎడిషన్​పై ఈ ముసలి జోడీ ఫొటోలు కవర్ పేజీలుగా పబ్లిష్ అయ్యాయి. వీళ్ల ఫాలోయింగ్ గురించి ఇంటర్నేషనల్ మీడియా హౌజుల్లో బోలెడన్ని కథనాలు వచ్చాయి.  దీంతో ఈ కపుల్ క్రేజ్​ తైవాన్​ నుంచి మిగతా దేశాలకు విస్తరించింది.  ప్రస్తుతం వీళ్ల వాట్​షోయాజ్​యంగ్​

ఇన్​స్టాగ్రామ్​ పేజీకి ఆరున్నర లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఏదో సరదాగా వాళ్ల బోర్​డమ్​ని దూరం చేయడానికి వాళ్ల మనవడు చేసిన పని.. ఊహించకుండా వాళ్లను సెలబ్రిటీల్ని చేసేసింది. అంతేకాదు  ఈ కరోనా టైంలో ఈ పెద్దోళ్లిద్దరూ తమ స్టయిలింగ్​తో మస్త్ టైంపాస్​ అందించారని చాలామంది కామెంట్స్​ చేస్తుండడం విశేషం.

ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్​

ఈ ఆక్టోజెనేరియన్​ (79 నుంచి 90 ఏండ్ల మధ్య వయసున్నవాళ్లు) కపుల్..  కెమెరా ముందు ఎంతో నేచురల్​గా, అందంగా ఫోజులు ఇస్తుంది. పైగా ఈ ఫొటోషూట్స్​ ద్వారా ఛాంగ్​ తన వయసు 30 ఏండ్లు వెనక్కి వెళ్లినట్లు ఫీలవుతున్నాడు.  రోడ్ల మీద వెళ్తుంటే..  ఎంతో మంది గుర్తుపట్టి ఆయన్ని ఆటోగ్రాఫ్​లు అడుగుతున్నారట. ‘నేను ముసలిదాన్నే.  కానీ, నా మనసుకి వయసు అయిపోలేదు’ అంటోంది బామ్మ సు షో.  అయితే ఈ జంటకి మరో ఇంటెన్షన్​ కూడా ఉంది. అదే ఎన్విరాన్​మెంటల్ ఫ్యాషన్​ ఎంకరేజ్​ చేయాలని.  ‘ఫాస్ట్ ఫ్యాషన్​, కొత్త బట్టలు కొనుక్కోవడం వృథా ఖర్చు.  పైగా అవి పర్యావరణానికి మంచిది కూడా కాదు. అదే  సెకండ్ హ్యాండ్​ క్లాత్స్​ ఫ్యాషనబుల్​గా ఉంటాయి.  వాటిని సరికొత్తగా చూపించేందుకు బోలెడు మార్గాలు ఉంటాయి. వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి డ్యామేజ్​ కూడా జరగదు’ అని చెప్తోంది ఈ ఓల్డ్ ఫ్యాషనబుల్​ కపుల్​.

Tagged Celebrities, couple, international, old, Eco Friendly, fame, fashions, grandparents, old age models, sho-er who, Taiwan, taiwanese, the idea king, thivan, wanji

Latest Videos

Subscribe Now

More News