
కోటపల్లి, వెలుగు : ఇంటి గోడ కూలి మీద పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కోటపల్లి మండలం భావనపల్లి గ్రామానికి చెందిన పానగంటి శ్రీనివాస్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కాగా పాత ఇంటిని కూల్చే పనులు కోటపల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు కూలీలు రెడ్డి మధునయ్య,శేగం తిరుపతికి ఇచ్చాడు. వీరు శుక్రవారం పాత ఇంటిని కూలుస్తుండగా ఒక్కసారి గోడ కూలి మీద పడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే 108లో చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. కూలీల మృతితో కోటపల్లిలో విషాదం నెలకొంది. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలను నమోదు చేసినట్టు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.