అయ్యా.. నీ కాళ్లు మొక్కుతా... నాకు ఒక నీడ చూపెట్టండి

అయ్యా.. నీ కాళ్లు మొక్కుతా... నాకు ఒక నీడ చూపెట్టండి

అయ్యా నీ కాళ్లు మొక్కుతా.. నాకు ఒక నీడ చూపెట్టడంటూ.. ఓ వృద్ధురాలు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కాళ్లపై పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పించమని తన గోడును వెళ్లబోసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వచ్చారు. అయితే అక్కడకి పట్టణంలోని ప్రగతీ నగర్ కు చెందిన బైరవేణి భారతి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని వినోద్ కుమార్ కాళ్లపై పడి.. వినతీ పత్రం అందజేసింది. కన్నీరు పెట్టుకొని తన చిరకాల కోరికను నెరవేర్చాలని వేడుకుంది. 

ALSO READ : ఇజ్రాయిల్‌లోని భారతీయ విద్యార్థులను తీసుకొస్తాం: కేంద్రమంత్రి మీనాక్షి లేఖి

గత కొన్ని సంవత్సరాల నుంచి నాలుగుసార్లు అప్లికేషన్ పెట్టుకున్న ఇప్పటివరకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని తన గోడు వెల్లబోసుకుంది. తనకు పిల్లలు లేరని.. పాతికేళ్లుగా భార్యాభర్తలం అద్దె ఇళ్లలో ఉంటున్నామని, కిరాయి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయింది. డబ్బులు ఉన్నోళ్లకే స్థానిక అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించారని.. అర్హలైన తనలాంటి వారికి ఇండ్లు కేటాయించలేరని ఆవేదన వ్యక్తం చేసింది.