
కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలో రచ్చ నర్సవ్వ(75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కొడుకులు, నలుగురు బిడ్డలు. నెలకో కొడుకు ఇంటి దగ్గర ఉంటూ జీవనం కొనసాగిస్తోన్న నర్సవ్వ.. ఈనెల 20న రెండో కొడుకు రమేష్ ఇంటికి వచ్చింది.
నిన్న రాత్రి నుంచి తన తల్లి నర్సవ్వ కనపడటం లేదంటూ బంధువులకు సమాచారం ఇచ్చాడు రమేష్. అయితే ఈ రోజు అతని ఇంటిపైనే నర్సవ్వ తాడుకు వేలాడుతూ చనిపోయి ఉండటం కనిపించింది. రమేషే నర్సవ్వని ఉరి వేసి చంపి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నాడని నర్సవ్వ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.