
రామడుగు, వెలుగు: వయోభారంతో శతాధిక వృద్ధురాలు కన్నుమూసింది. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన చేని నర్సవ్వ(106) కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కొడుకులు భూమయ్య, వెంకటేశం, రాయమల్లు, కూతురు వెంకటమ్మ ఉన్నారు. నర్సవ్వకు మూడు తరాలకు చెందిన 68 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. మనుమలు, మనమరాళ్లు, ముని మనమలు, ముని మనుమరాళ్లతో ఆమె గడిపింది.