జెనీవా: ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్ మహిళలు పాల్గొనకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి విమెన్స్ కేటగిరీ పోటీల్లో కేవలం పుట్టుకతో అమ్మాయిలైన వారు మాత్రమే పాల్గొనేలా కొత్త నిబంధనలను తెచ్చినట్టు గురువారం తెలిపింది.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతంలో జారీ చేసిన ‘మహిళా క్రీడల్లో పురుషులకు అనుమతి లేదు’ అనే ఉత్తర్వులకు అనుగుణంగా ఐఓసీ ఈ చర్యలు చేపట్టింది. తాజా రూల్స్ ప్రకారం విమెన్స్ కేటగిరీలో పోటీ పడే ప్లేయర్లు తమ కెరీర్‌లో ఓసారి తప్పనిసరిగా జన్యు పరీక్ష చేయించుకోవాలి. పురుష లక్షణాలకు కారణమయ్యే ఎస్‌ఆర్‌వై జన్యువు ఉనికిని దీని ద్వారా నిర్ధారిస్తారు. ఈ నిర్ణయం ద్వారా క్రీడల్లో పారదర్శకత, సమానత్వం పెరుగుతుందని ఐఓసీ విమెన్ ప్రెసిడెంట్ కిర్‌స్టీ కోవెంట్రీ తెలిపింది.
