లోక్ సభ స్పీకర్ గా మళ్ళీ ఓం బిర్లా.!

లోక్ సభ స్పీకర్ గా మళ్ళీ ఓం బిర్లా.!

లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. గత లోక్‌సభలో బీజేపీకి చెందిన ఓం బిర్లా స్పీకర్‌గా ఉన్నారు. ఈ సారి ఓం బిర్లా ఎన్డీయే అభ్యర్థి తరపున కాసేపట్లో  నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

మరో వైపు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఇండియా కూటమి నేతలతో రాజ్  నాథ్ సింగ్ చర్చలు జరిపారు.  అయితే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే మద్దతిస్తామని  ఇండియా కూటమి నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరారు. స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉంది.. కానీ డిప్యూటీ స్పీకర్ మాకే ఇవ్వాలని  రాహుల్ గాంధీ అన్నారు.