23 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

23 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయి. నిన్నటి వరకు 961 ఉన్న ఒమిక్రాన్ కేసులు గడిచిన 24 గంటల్లోనే 309 పెరిగి.. మొత్తం కేసుల సంఖ్య 1,270కి చేరింది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 450 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 320, కేరళ లో 109, గుజరాత్ 97, రాజస్థాన్  69కి చేరాయి. ఇప్పటి వరకు 374 మంది ఒమిక్రాన్ బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో 16,764 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 7585 మంది పూర్తిగా కోలుకోగా, 220 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,361 యాక్టివ్ కేసులు ఉన్నాయి.