జనంలో ఒమిక్రాన్ టెన్షన్

జనంలో ఒమిక్రాన్ టెన్షన్

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి....నిన్న ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కి చేరింది. ఢిల్లీలో కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా... కేరళలో నాలుగు, గుజరాత్ లో ఒక్కో కేసు నమోదైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 54 పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలో 28 కేసులు, తెలంగాణ లో 20 కేసులు, కర్ణాటకలో 19, గుజరాత్ లో 14 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. రాజస్థాన్ లో 17, కేరళలో 15 కేసులు ఉన్నాయి. ఛత్తీస్ గఢ్, బెంగాల్, తమిళనాడులో ఒక్కో కేసు ఉండగా... యూపీలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. 

ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో జనంలో టెన్షన్ మొదలైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ రాకపోకలు పెరగడంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్స్ లో ఒమిక్రాన్ బాధితులు, ఒమిక్రాన్ అనుమానితులు మొత్తంగా 40 మందికి పైగా ఉన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ లో కరోనా దాని వేరియంట్స్ ను గుర్తించే జీనోం సీక్వెన్సింగ్ ప్రారంభమైంది

కోవిడ్ ను నిరోధించేందుకు ముక్కు ద్వారా తీసుకునే టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. దీన్ని బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు తుదిదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ DCGIకు దరఖాస్తు చేసుకుంది. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ముక్కు ద్వారా తీసుకునే టీకా ఎంతో తేలికగా ఉంటుందని భారత్ బయోటెక్ తన దరఖాస్తులో పేర్కొంది. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్న వేళ బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.