ఢిల్లీలో ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేని వారికీ ఒమిక్రాన్

ఢిల్లీలో ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేని వారికీ ఒమిక్రాన్

తొలిగా దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి.. కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరినట్టుగా కనిపిస్తోందని ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. విదేశీ ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ రావడమంటే అర్థమిదేనని చెప్పారు. ఢిల్లీలో ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేని వాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకినట్లు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 46 శాతానికి ఒమిక్రాన్ కేసులు చేరుకున్నట్లు చెప్పారు.

కాగా, ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,313 కరోనా కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పాజిటివ్ రేటు 1.73 శాతంగా ఉందని చెప్పింది. గడిచిన 24 గంటల్లో 423 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,081 ఉన్నాయని తెలిపింది. అయితే 900 పైగా కేసులు నమోదు కావడమే దాదాపు ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. మరోవైపు ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య దాదాపుగా 300 వరకు చేరాయి.