57వ వసంతంలోకి అడుగుపెట్టిన షారుఖ్ ఖాన్

57వ వసంతంలోకి అడుగుపెట్టిన షారుఖ్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టినరోజు అంటే ఆయన ఫ్యాన్స్ ఓ పండుగలా భావిస్తారనడంలో ఏ మాత్రం తప్పు కాదేమో. ఈ రోజుతో షారుఖ్ 57వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన బర్త్ డే రోజున ప్రతి ఏడాది రోజున ఆయన ఇంటి ముందు ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటిలాగే ఈ సారీ... షారుఖ్ కు విషెస్ చెప్పేందుకు ఆయన నివాసం ముందు తెల్లవారుజాము నుంచే భారీ స్థాయిలో అభిమానులు చేరుకున్నారు. వారి అభిమానాన్ని, ఆప్యాయతల్ని కళ్లారా చూసేందుకు ఆయన తన బంగ్లా పైకి ఎక్కి ఫ్యాన్స్ ను పలకరించాడు. చేయి ఊపుతూ అభిమానుల్ని ఆనందపరిచాడు. ఆయనతో పాటు వెంట షారుఖ్ 9ఏళ్ల కుమారుడు అభి రామ్ కూడా ఉన్నాడు. బాల్కనీలో నిలబడి ఫ్యాన్స్ కు హాయ్ చెప్పే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
 
అంతే కాకుండా ఓ సిగ్నేచర్ ఫోజ్ తో షారుఖ్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బాల్కలో నిలబడే ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగాడు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. 'బాజీగర్', 'కభీ హాన్ కభీ నా', 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై', 'కల్ హో నా హో', 'వీర్ జరా' లాంటి మరెన్నో చిత్రాల ద్వారా షారుఖ్ ప్రేక్షకులను అందించాడు. ఆయన నెక్స్ట్ చిత్రం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న పఠాన్ లో దీపికా పదుకునే, జాన్ అబ్రహాంలతో కలిసి నటించనున్నాడు. పలు భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 25, 2023న థియేటర్లో రిలీజ్ కానుంది.