
స్టాక్‌హోమ్: స్వీడన్‌కు చెందిన ఆరోగ్య మంత్రి ఎలిజబెత్ సాన్ మీడియాతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆమె హెల్త్ మినిస్టర్‌గా పదవీబాధ్యతలు తీసుకున్న కొద్ది గంటలకే ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయింది. స్వీడన్ ప్రధాని క్రిస్టర్‌సన్, క్రిస్టియన్ డెమోక్రాట్స్ పార్టీ లీడర్ ఎబ్బా బుష్‌తో కలిసి ఎలిజబెత్ కూడా ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిస్తుండగా శ్రద్ధగా వింటున్న హెల్త్ మినిస్టర్ ఉన్నట్టుండి వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్న హెబ్బా బుష్, అధికారులు ఆమెను పైకి లేపారు. కాసేపటికి తేరుకున్న ఆమె తిరిగి సమావేశంలోకి వచ్చి తన అస్వస్థతకు కారణాన్ని వివరించారు. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గినందుకే ఇలా జరిగిందన్నారు. ఈ ఘటనతో అధికారులు ప్రెస్ మీట్‌ను రద్దు చేశారు. అంతకుముందు హెల్త్ మినిస్టర్‌గా పనిచేసిన జోహన్సన్ రాజీనామాతో ప్రభుత్వం ఎలిజబెత్ లాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.