శ్రీదేవీ బర్త్ డే... భావోద్వేగ పోస్టులు చేసిన కూతుళ్లు

శ్రీదేవీ బర్త్ డే... భావోద్వేగ పోస్టులు చేసిన కూతుళ్లు

తల్లి శ్రీదేవి 59వ జన్మదినోత్సవం సందర్భంగా ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు భావోద్వేగ పోస్ట్‌లు చేశారు. నటి శ్రీదేవితో కలిసి ఉన్న చిన్ననాటి చిత్రాన్ని షేర్ చేసిన జాన్వీ కపూరి...  "హ్యాపీ బర్త్‌డే అమ్మా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని తెలిపింది. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన చిన్నప్పుడు తల్లి శ్రీదేవీతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలో శ్రీదేవీ ఎరుపు రంగు చీరలో నవ్వుతూ.. జాన్వీని ఆత్మీయంగా పట్టుకోవడాన్ని చూడవచ్చు.

ఇక ఇదే తరహాలో ఖుషీ కపూర్ కూడా... తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా శ్రీదేవీతో దిగిన ఫొటోను పెట్టుకున్నారు. ఈ పిక్ లో శ్రీదేవీ.. ఖుషీ కపూర్ చెంపపై ముద్దు పెడుతుండడాన్ని గమనించవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రసారమైన కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం విషయం తెలిసిందే. అందులో భాగంగా తన తల్లితో ఆమెకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. తల్లి చనిపోయాక తన జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయని... ఈ రోజు సురక్షితంగా ఉన్నానంటే అన్షు దీదీ, అర్జున్ భయ్యాల వల్లేనని చెప్పుకొచ్చింది.