ఫస్ట్​ డే 21.02 లక్షల మందికి రైతుబంధు

ఫస్ట్​ డే 21.02 లక్షల మందికి రైతుబంధు
  • రూ.607.32 కోట్లు రైతుల అకౌంట్లలో జమ

హైదరాబాద్‌, వెలుగు: యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న  పదో విడత రైతుబంధు నగదును రాష్ట్ర సర్కారు రైతుల  బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. బుధవారం నుంచి ప్రారంభమైన పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి రోజున ఒక ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు వారి అకౌంట్‌లలో  రూ.607.32 కోట్లు జమ చేశారు. రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు గురువారం రైతుబంధు పెట్టుబడి సాయం అందించనున్నారు. ఇలా రోజువారీగా ఎకరం చొప్పున పెంచుతూ రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది.   సీసీఎల్‌ఏ ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల డేటాతో  వ్యవసాయ శాఖ రైతులను గుర్తించి బ్యాంకు వివరాలను నమోదు చేస్తోంది. దీంతో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమవుతున్నాయి.