రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో భక్తుల రద్దీ

రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో భక్తుల రద్దీ

రంగారెడ్డి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటల నుండి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. హైదర్ గూడ ప్రణవభక్త సమాజం ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుమారు 50 వేల మంది భక్తులు చిన్న అనంతగిరి దేవాలయాన్ని మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శించుకోవడం విశేషం. 400 ఏండ్ల చరిత్ర గలిగిన ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ సంవత్సరం సుమారు 80 వేల మంది భక్తులు చిన్న అనంతగిరి దేవాలయాన్ని సందర్శిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.