కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా

కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా

డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి నిర్మాతగా మారిన రాజేష్ దండా ప్రస్తుతం వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కెరీర్ గురించి, ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల గురించి  రాజేష్ చెప్పిన విశేషాలు. 

‘‘హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌ మొదలుపెట్టినప్పట్నుంచీ నాకు నచ్చిన కథలను నిర్మిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. గతేడాది ‘సామజవరగమన’, ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాలు హిట్ అవడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందనుకుంటున్నా.  ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో  ‘బచ్చలమల్లి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇది 1990 బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే కథ.  

కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టు పక్కల పల్లెటూరుల్లో  షూటింగ్ చేస్తున్నాం.  సింగిల్ షెడ్యూల్‌‌లో సినిమా పూర్తి చేస్తాం. అలాగే సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు  నక్కిన డైరెక్షన్‌‌లో ఓ మూవీ మొదలుపెడుతున్నాం.  దీనికి ప్రసన్నకుమార్  రాసిన కథ నాకు బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరంతోనూ ఓ మూవీ చేస్తున్నా.

మా బ్యానర్‌‌‌‌లో వచ్చే చిత్రాలన్నీ కొత్త కథలతో తీయాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అనే తేడాలేదు. ఎవరి సినిమాలు బాగా ఆడతాయో వారి  బిజినెస్ బాగా జరుగుతుంది.  నేను చేసే హీరోలు నాకు పర్సనల్ ఫ్రెండ్స్ అవడం నా అదృష్టం. అలాగే సినిమా పరంగా చూస్తే, కథ, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ అన్నీ పర్ఫెక్ట్‌‌గా  ప్లాన్ చేసుకుంటా’’.