లెజెండ్స్ ఎంట్రీ: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మరపురాని రోజు ఇవాళే

లెజెండ్స్ ఎంట్రీ: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మరపురాని రోజు ఇవాళే

భారత క్రికెట్‌ చరిత్రలో జూన్‌ 20వ తేదీ చాలాప్రత్యేకమైన రోజు. ఎందుకంటే.. ఇదే రోజు భారత టెస్ట్ క్రికెట్‌కు ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు పరిచయమయ్యారు. అందులో ఒకరు.. తన దూకుడైన ఆటతీరుతో, కెప్టెన్సీ మార్కుతో భారత క్రికెట్‌కు ప్రాణం పోయగా.. మరొకరు తనకు మాత్రమే సాధ్యమైన డిఫెన్స్‌ టెక్నిక్‌తో, కష్టాల్లో ఉన్నప్పుడు జట్టుకు అడ్డుగోడలా నిలిచేవారు. ఇక మూడవ వ్యక్తి.. వీరిద్దరి నైపుణ్యాలను కలబోసుకుని ఆధునిక భారత క్రికెట్‌కు మార్గనిర్ధేశకుడిగా నిలిచాడు.

ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ. గంగూలీ, ద్రవిడ్‌ ఇద్దరూ 1996, జూన్ 20వ తేదీన లార్డ్స్‌ వేదికగా టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేయగా.. కోహ్లి 2011, జూన్‌ 20వ తేదీన కింగ్‌స్టన్‌ వేదికగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక గంగూలీ తన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ(131) చేసి కెరీర్‌కు బలమైన పునాది వేసుకోగా, ద్రవిడ్‌ కూడా తన అరంగేట్ర ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. ఈ విషయంలో కోహ్లి(4,15) కాస్త వెనుకబడి ఉండొచ్చేమో కానీ, ఆ తర్వాత అతడు పుంజుకున్న తీరు.. భారత క్రికెట్‌ జట్టును నడిపిన తీరు అద్భుతమనే చెప్పాలి.

 కెరీర్ మొత్తంగా 113 టెస్టులు ఆడిన గంగూలీ 42.17 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ద్రవిడ్ విషయానికొస్తే.. 164 టెస్టుల్లో 52.31 సగటుతో 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక పరుగుల యంత్రం కోహ్లీ విషయానికొస్తే.. ఇప్పటివరకు 109 టెస్టుల్లో 48.72 సగటుతో 8479 పరుగులు చేశాడు.  ఇందులో 7 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఇలా ఒకే తేదీన టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ముగ్గురు భారత జట్టుకు కెప్టెన్లుగా కూడా సేవలందించారు.

#OnThisDay, Rahul Dravid, Sourav Ganguly, and Virat Kohli made their Test debuts for India, leaving a lasting impact on Indian cricket.

What a day for Indian cricket!#CricTracker | #RahulDravid | @SGanguly99 | @imVkohli pic.twitter.com/6PPHDCKY7k

— CricTracker (@Cricketracker) June 20, 2023

Magnificent 3 of Indian cricket ???

Rahul Dravid & Sourav Ganguly made their Test debut #OnThisDay in 1996, while Virat Kohli made his Test debut #OnThisDay in 2011?#Cricket #India #Test #BCCI pic.twitter.com/QqJICZqfYx

— Sportskeeda (@Sportskeeda) June 20, 2023