రాజీవ్ స్వగృహ ప్లాట్లు మరోసారి అర్రాస్

రాజీవ్ స్వగృహ ప్లాట్లు మరోసారి అర్రాస్
  • బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిగిలిపోయిన భూముల వేలం
  • మరో 300 ప్లాట్ల అమ్మకానికి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ ఏర్పాట్లు
  • వచ్చే నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేల్స్.. 10 రోజుల్లో నోటిఫికేషన్!

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లాలోని బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ప్లాట్లను మరోసారి వేలం వేసేందుకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ సిద్ధమవుతోంది. వీటితోపాటు మరో 300 ప్లాట్లు అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఫస్ట్ ఫేజ్ కింద 101 ప్లాట్లకు వేలం వేయగా.. 77 ప్లాట్లు అమ్ముడుపోయాయి. 24 ప్లాట్లు మిగిలాయి. తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 223 ప్లాట్లకు వేలం వేయగా.. 220 అమ్ముడుపోయాయి. 3 ప్లాట్లు మిగిలాయి. అప్పట్లో 500 చదరపు గజాలకుపైగా ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. మిగిలినవి కూడా ఇంతకు మించినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్లాట్ల విస్తీర్ణాన్ని తక్కువగా మార్చి మరోసారి వేలం వేయనున్నారు. ఈ 10 రోజుల్లో వేలానికి సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

మరో రూ.350 కోట్లు రాబట్టే ప్లాన్

బహదూర్ పల్లి, తొర్రూర్ లేఅవుట్లలో ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా 324 ప్లాట్లు వేలం వేస్తే.. రూ.255 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ భావించింది. అయితే అంచనాకు మించి రూ.334 కోట్లు వచ్చింది. బహదూర్ పల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 వేలుగా రేట్లను ఫిక్స్ చేశారు. కానీ అక్కడ ఇంతకు ఎక్కువగా రేట్లను పెట్టి కొనుగోలు చేశారు. బహదూర్ పల్లిలో కొన్ని ప్లాట్లు చదరపు గజానికి అత్యధికంగా రూ.38,500, తొర్రూర్ లో రూ.50 వేలు పెట్టి కొనుగోలు చేశారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరోసారి ఆదాయాన్ని రాబట్టే పనిలో హెచ్ఎండీఏ అధికారులు బిజీ అయ్యారు. బహదూర్ పల్లి, తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మిగిలిన 27 ప్లాట్లతోపాటు అందుబాటులో ఉన్న మరో 300 ప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 200, బహదూర్ పల్లిలో మరో వంద ప్లాట్లు వేలం వేయనున్నట్లు తెలిసింది. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.350 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో మాదిరిగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ వేలంలోనే ఈ ప్లాట్లను కూడా వచ్చే నెలలో విక్రయించనున్నారు. ఈ సారీ పాత రేట్లకే విక్రయించనున్నారు. తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.20 వేలు, బహదూర్ పల్లిలో రూ.25 వేలకు చదరపు గజం చొప్పున విక్రయించనున్నారు.

మరో ఏడు జిల్లాల్లోనూ..

హైదరాబాద్ శివార్లలోని బహదూర్ పల్లి, తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో ఏడు జిల్లాల్లోనూ రెండు నెలల క్రితం రాజీవ్ స్వగృహ ప్లాట వేలం నిర్వహించారు. నల్లొండ జిల్లాలోని నార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో 240 ప్లాట్ల వేలం వేయగా, 165 అమ్ముడుపోయాయి. 75 ప్లాట్లు మిగిలాయి. కామారెడ్డిలో 230 ప్లాట్లలో ఇంకా 13 ప్లాట్లు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలోని యాలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 ప్లాట్లకు వేలం వేయగా, 13 అమ్ముడుపోలేదు. వీటికి కూడా మరోసారి వేలం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.