ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి

ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి

రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో  విషాదం చేటుచోటుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటూ వెళ్లి చెరువుతో పడి మృతి చెందింది. మంగళవారం సాయంత్ర నుంచి కనిపించకుండాపోయిన మోక్షితా మృతదేహాన్ని నార్సింగి ఠాణా  పోలీసులు గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రుల కర్నూల్ జిల్లా నుంచి వలస వచ్చి  మణికొండ మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో  చెత్త సేకరిస్తూ పక్కనే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. 

పాప ఆడుకుంటూ పక్కనే ఉన్న ముస్కు చెరువు దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిజాస్టర్ టీం మృతదేహాన్ని చెరువులోనుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. 

ALSO READ:  అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి